తెలంగాణ ప్రజలకు అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలి: పన్యాల జైపాల్ రెడ్డి
ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబరు 2:
తెలంగాణ రాష్ట్రం, ప్రజలపై, ప్రజాకవి గద్దర్ అన్నపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో టీపీసీసీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో సోమవారం అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమానికి గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పన్యాల జైపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన అమిత్ షా వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ అడ్వకేట్ మదుపు శశికాంత్, అడ్వకేట్ నల్లగాటి రాంబాబు, న్యాయవాదులు ఆకుల సత్యనారాయణ, జక్కుల వెంకటేష్, ప్రసాద్, సీనియర్ నాయకులు జానిమియా, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి అర్రబైరు ప్రవీణ్ రెడ్డి, కరీం, నరేందర్, అస్లాం, భాను తదితరులు పాల్గొన్నారు.

