గూడెంకొత్తవీధి, నవంబర్ 2 (పెన్ పవర్):అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదిత్య వర్మ గూడెంకొత్తవీధి మండలంలోని పెదవలస హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు పురోగతి, దివ్యాంగ ఓటర్ల (PWD) కోసం వీల్చైర్ల సౌకర్యం, ఓటరు స్లిప్పుల పంపిణీపై అధికారులతో సమీక్షించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి. బాబు నాయక్, తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు, బీఎల్ఓలు పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలపై ఐటీడీఏ పీవో తనిఖీ
RELATED ARTICLES

