గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 2:దేవరాపల్లి పంచాయతీ పరిధిలోని రామగడ్డ, పరిసర గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిని జర్త వరలక్ష్మి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలుసుకుంటూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, తాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రచారంలో స్థానిక వైసీపీ నాయకులు, మహిళా కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
దేవరపల్లి పంచాయతీలో జర్త వరలక్ష్మి విస్తృత ప్రచారం
RELATED ARTICLES

