*మారుమోగిన గోవింద నామస్మరణ*
గార్ల, పెన్ పవర్, నవంబర్: 2
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల ముగింపు అనంతరం గార్లకు చేరుకున్న శ్రీ భూనీల సమేత వెంకటేశ్వర స్వామివారికి సోమవారం రాత్రి గరుడ వాహన సేవను అంగరంగ వైభవంగా జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ప్రతిష్టించి మేళ తాళాల నడుమ గార్ల పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు గోవింద నామస్మరణతో మారు మోగింది ఆలయ గడప దాటి తన ఇష్ట వాహనమైన గరుత్మంతుని అధిరోహించిన స్వామి వారు విహరిస్తూ భక్తులకు దర్శనం ఇచ్చారు స్వామివారిని గరుడ వాహనంపై చూసిన భక్తులు కనులారా దర్శించుకుని తన్మయత్వంలో మునిగితేలారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను వితరణ చేశారు ఈ సందర్భంగా అర్చకులు అచ్యుత్ ఆచార్య మాట్లాడుతూ స్వామివారికి గరుడ వాహనమంటే మిక్కిలి ఇష్టమని దాస్య భక్తితో కొలిచే భక్తులకు తాను దాసుడినవుతానని గరుడ వాహనం ద్వారా స్వామి వారు తెలియజేస్తున్నాడని మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడ వాహనంపై స్వామివారిని దర్శిస్తే సర్వ పాపాలు తొలుగు తాయన్నారు ఈ కార్యక్రమంలో అర్చకులు గోవింద ఆచార్య రాము ఆలయ కార్యనిర్వాక అధికారి సత్యనారాయణ ఆలయ చైర్మన్ అజ్మీరా బన్సీలాల్ వైస్ చైర్మన్ అర్జున గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పార్వతి హథిరాం నాయక్ టీటీడీ ధర్మ ప్రచార కమిటీ సభ్యులు రాములు నాయక్ పట్టణ పుర ప్రముఖులు రమేష్ బాబు వేమిశెట్టి శ్రీనివాస్ సతీష్ కుమార్ సత్యం ఒబిలి శెట్టి కృష్ణ కోటా సంపత్ కోట శ్రీను తదితరులు పాల్గొన్నారు

