గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్,17:దేవరాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున మంగళపాలెం గ్రామానికి చెందిన మర్రి శాంతికుమారి నామినేషన్ దాఖలు చేశారు. కొర్ర సతీష్ బాబు సతీమణి అయిన ఆమె ఎన్నికల బరిలో నిలిచారు.ఈ సందర్భంగా నామినేషన్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ దేవరాపల్లి పంచాయతీ అధ్యక్షుడు కుమ్మరి రామలింగం, పార్టీ కార్యదర్శి అణుగూరు రామారావుతో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేవరాపల్లి సర్పంచ్ పోరులో వైసీపీ అభ్యర్థి శాంతికుమారి!
RELATED ARTICLES

