తపాలా శాఖ కల్పిస్తున్న ప్రమాద భీమా పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: మామిడి రాంచందర్
తపాలా శాఖ ఆధ్వర్యంలో ప్రమాద భీమా పథకాలపై అవగాహన
అవగాహన సదస్సుకు అనూహ్య స్పందన
ఎల్బీనగర్, పెన్ పవర్, నవంబర్ 18:
కేంద్ర తపాలా శాఖ కనిపిస్తున్న ప్రమాద బీమా పథకం, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పిపిఎఫ్ పథకం, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని భరత్ నగర్ కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, ఎన్టీఆర్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి రామచందర్ సూచించారు. కేంద్ర తపాలా శాఖ ఆధ్వర్యంలో యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, పీపీఎఫ్ పథకం, సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ తదితర పథకాల గురించి మహేశ్వరం నియోజకవర్గం ఎన్టీఆర్ నగర్, భరత్ నగర్, రాజీవ్‌గాంధీ నగర్ తదితర ప్రాంతాలలో బుధవారం తపాలా శాఖ సిబ్బంది ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టి పథకాల గురించి వివరించారు. అదే విధంగా తపాలా శాఖ కల్పిస్తున్న ఇన్సూరెన్స్ పాలసీలను ప్రజలచే చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తపాలా శాఖ కల్పిస్తున్న పథకాలను ప్రజల సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకుముందు ప్రజలకు ప్రమాద భీమా, ఇతర భీమాలకు సంబంధించిన పత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన లభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు కానిగంటి అశోక్, కిన్నెర కుమార్, తపాలా శాఖ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శ్రీకాంత్, సిబ్బంది నాగేశ్వరరావు, రాకేష్, హరీష్, పల్లవి, సంపత్, యాదయ్య, స్థానికులు పాల్గొన్నారు.

