గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 3:జడ్పీటీసీ స్వతంత్ర అభ్యర్థి కంకిపాటి మోహన్‌రావు మండలంలోని పలు గ్రామాల్లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెదవలస, కట్టుపల్లి, దామనపల్లి, రింతాడ, జర్రెల, దేవరపల్లి పంచాయతీల పరిధిలో పర్యటిస్తూ ఓటర్లను కలుసుకుని మద్దతు కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో తనకు ఒక అవకాశం కల్పించి, బ్లాక్ బోర్డు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలందిస్తానని హామీ ఇచ్చారు.ఈ ప్రచార కార్యక్రమంలో అభ్యర్థి అనుచరులు, స్థానిక నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
బ్లాక్ బోర్డు గుర్తుతో మోహన్‌రావు ముమ్మర ప్రచారం.. పలు గ్రామాల్లో ప్రజలతో మమేకం!
RELATED ARTICLES

