చక్రపాణి యాదవ్‌కు బొంతు శ్రీదేవి యాదవ్ ఘన నివాళి
కాప్రా, పెన్ పవర్, నవంబరు 5:
అఖిల భారత యాదవ మహాసభ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, శాసన మండలి మాజీ చైర్మన్ చక్రపాణి యాదవ్ పార్థివ దేహానికి అఖిల భారత యాదవ మహాసభ తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, చర్లపల్లి మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ ఘనంగా నివాళులర్పించారు.
బంజారాహిల్స్‌లోని చక్రపాణి యాదవ్ స్వగృహానికి వెళ్లిన ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
చక్రపాణి యాదవ్ తనకు గురువుగా ఉండి, యాదవ సమాజ అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారని శ్రీదేవి యాదవ్ పేర్కొన్నారు. యాదవ సమాజానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.

