నెహ్రూ నగర్లో నూతనంగా శరత్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ ప్రారంభం
ఆధునిక వైద్య సేవలు సామాన్య ప్రజలకు అందుబాటులోకి రావాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
ఖమ్మం, పెన్ పవర్, నవంబర్ 5:
ఖమ్మం నగరంలోని నెహ్రూ నగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన శరత్ ఆర్థోపెడిక్ హాస్పిటల్‌ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం ప్రారంభించారు. ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఆధునిక వైద్య సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ఈ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్యం అనేది ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండాల్సిన ప్రాథమిక అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నాణ్యమైన వైద్య సేవలను అందించాలని సూచించారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతికత ఎంత ముఖ్యమో, రోగుల పట్ల వైద్యుల నమ్మకం, మానవత్వం, సేవాభావం కూడా అంతే ముఖ్యమని అభిప్రాయపడ్డారు.
నూతన ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం సందడిగా సాగింది. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది అతిథులకు స్వాగతం పలికారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. నూతనంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఆసుపత్రి ద్వారా ఖమ్మం నగరంతో పాటు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి.

