ePaper
Wednesday, May 6, 2026
ePaper
Homeజాతియంసినిమా నుంచి సింహాసనం వరకు...

సినిమా నుంచి సింహాసనం వరకు…

📰 Generate e-Paper Clip

చిత్ర పరిశ్రమలో అవమానాల నుంచి ప్రారంభమైన ప్రయాణం… కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న స్టార్… ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగిన దళపతి విజయ్. ఆయన మూలాలు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నాయన్న చర్చ ఇప్పుడు మరింత వేడెక్కుతోంది.

ఏపీ మూలాలు.. తమిళనాడులో ఎదుగుదల
విభిన్న నేపథ్యంతో కుటుంబ నిర్మాణం
మత విశ్వాసం – రాజకీయ అజెండా
అవమానాల నుంచి ‘దళపతి’ స్థాయి వరకు
రాజకీయాల్లో ఖాళీని పసిగట్టిన స్ట్రాటజీ

చిత్తూరు, పెన్ పవర్, మే 6:

తమిళనాడు రాజకీయాల్లో సంచలనంగా మారిన పేరు – దళపతి విజయ్. సినీ రంగంలో సూపర్ స్టార్‌గా ఎదిగిన ఆయన… ఇప్పుడు రాజకీయాల్లో కీలక స్థానాన్ని దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారన్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. 


విజయ్ కుటుంబం ఆంధ్రప్రదేశ్ నుంచి వలస వెళ్లినదే. ఆయన తాత చిత్తూరు ప్రాంతానికి చెందినవారు. తర్వాత మద్రాస్ రాష్ట్ర కాలంలో రామేశ్వరానికి వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. విజయ్ తండ్రి చంద్రశేఖర్ సినీ రంగంలో రచయితగా గుర్తింపు పొందారు. తల్లి శోభ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవారు. ప్రేమ వివాహంతో ఏర్పడిన ఈ కుటుంబంలోనే విజయ్ జన్మించారు.క్రైస్తవ మతంపై చిన్ననాటి నుంచే ఆసక్తి పెంచుకున్న విజయ్… మత సమానత్వాన్ని రాజకీయ సిద్ధాంతంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లారు.సినిమా రంగంలో కులవివక్షను ఎదుర్కొన్న విజయ్… తన కష్టంతోనే స్టార్‌డమ్ సంపాదించారు. వరుస హిట్లతో 68 సినిమాల్లో నటించి తిరుగులేని హీరోగా నిలిచారు.కరుణానిధి, జయలలిత మరణాల తర్వాత వచ్చిన రాజకీయ శూన్యతను విజయ్ సరిగ్గా అంచనా వేశారు. ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి లక్ష్యానికి చేరువయ్యారు. ఆంధ్రప్రదేశ్ మూలాలు కలిగిన కుటుంబం నుంచి వచ్చిన విజయ్… తమిళ నేలపై తన ప్రతిభతో ఎదిగిన అరుదైన వ్యక్తిగా నిలిచారు. చిన్ననాటి నుంచి ఎదురైన అవమానాలు, కుల వివక్షలను ఛేదిస్తూ సినీ రంగంలో అగ్రస్థానాన్ని అందుకున్నారు. అక్కడితో ఆగకుండా ప్రజాసేవ వైపు మళ్లారు. రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా తన స్ట్రాటజీని స్పష్టంగా అమలు చేశారు. పొత్తులు లేకుండా ఒంటరిగా పోటీ చేస్తూ ప్రజల్లో నమ్మకం పెంచుకున్నారు. సీఎం పదవికి చేరువ కావడం ఆయన పట్టుదలకు నిదర్శనం.దళిత వర్గానికి చెందిన నేతగా దేశంలోనే మూడవ ముఖ్యమంత్రిగా అవతరించే అవకాశంతో విజయ్ పేరు చరిత్రలో నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. సినీ గ్లామర్‌ను ప్రజా శక్తిగా మార్చిన అరుదైన నాయకుడిగా ఆయన ఎదుగుదల ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular