కాజులూరు మండలంలో సర్ ఆర్థర్ కాటన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ
కాజులూరు, పెన్‌పవర్, మే 15ః కాజులూరు మండల పరిధిలోని డేగలపేట గ్రామానికి చెందిన కీర్తిశేషులు డేగల సత్యనారాయణ సర్ ఆర్థర్ కాటన్ దొరపై అపారమైన అభిమానం కలిగిన వ్యక్తిగా గ్రామ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అపర భగీరథుడిగా పేరుగాంచిన సర్ ఆర్థర్ కాటన్ జయంతిని ప్రతి ఏడాది అత్యంత భక్తి, గౌరవాలతో నిర్వహించడం ఆయన జీవితంలో ఓ నియమంగా కొనసాగింది.
గోదావరి జిల్లాలను అన్నపూర్ణగా మార్చిన మహనీయుడు కాటన్ దొర కృషిని ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని సంకల్పించిన డేగల సత్యనారాయణ, తెల్లటి వస్త్రధారణలో నల్లటి సైకిల్‌పై గ్రామాల్లో తిరుగుతూ రైతులకు స్వీట్లు పంచి కాటన్ దొర సేవలను స్మరించేవారని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. ఆయన ప్రస్తుతం మన మధ్య లేకపోయినా, కాటన్ దొరపై ఆయనకున్న భక్తి, సేవాభావం ప్రజల మదిలో సజీవంగా నిలిచిందని పలువురు పేర్కొన్నారు.సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా డేగల సత్యనారాయణకు, కాటన్ దొరకు ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో వేగి శ్రీనివాస్, సూరంపూడి భాను, దడాల ఏడుకొండలు,బాబి ,దడాల నాగార్జున, తదితరులు పాల్గొని వారి సేవలను స్మరించారు.
అలాగే మండలంలోని పలు గ్రామాల్లో కాటన్ దొర జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శలపాక నీటి సంఘం అధ్యక్షులు తాడి మాచారెడ్డి (టీఎంఆర్) ముందుగా కాటన్ దొర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “గోదావరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ దొర. దలేశ్వరం బ్యారేజీ నిర్మాణంతో కరువు నేలను సస్యశ్యామలం చేసి ఆంధ్రాను అన్నపూర్ణగా మార్చిన మహనీయుడు. తరాలు మారినా గోదావరి ప్రవహిస్తున్నంతకాలం కాటన్ దొర పేరు చిరస్థాయిగా నిలుస్తుంది” అని కొనియాడారు.మే 15న జన్మించిన సర్ ఆర్థర్ కాటన్ దొర నిర్మించిన కాలువల వ్యవస్థ ఇప్పటికీ రైతులకు వరంగా నిలిచిందని, ఆధునిక ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు చిరస్మరణీయమని రైతులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు, ప్రజాప్రతినిధులు కాటన్ దొరకు ఘన నివాళులు అర్పించారు.

