Homeఆంధ్రప్రదేశ్కాకినాడనేడు రామచంద్రపురంలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమావేశం

నేడు రామచంద్రపురంలో జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమావేశం

రామచంద్రపురం, పెన్ పవర్, జూన్ 29: జనసేన పార్టీ సంస్థాగత బలోపేతం, నిర్మాణ సారథుల సమాచార సేకరణలో భాగంగా రామచంద్రపురం నియోజకవర్గ స్థాయి సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు.రామచంద్రపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సమావేశానికి అమలాపురం పార్లమెంట్ పరిశీలకులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు రామచంద్రపురంలోని రాజగోపాల్ సెంటర్, హెచ్‌పీ పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న ఆర్.ఆర్. గ్రాండ్‌లో ఈ సమావేశం నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని జనసేన పార్టీ తరఫున వివిధ నామినేటెడ్ పదవుల్లో ఉన్న నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మాజీ వాలంటీర్లు , వీరమహిళలు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని పార్టీ నాయకులు కోరారు.పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేయడం,నిర్మాణ సారథుల వివరాల సేకరణ,భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular