ePaper
Saturday, May 16, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్పోలవరంపోలవరం నిర్వాసితులకు రూ.306 కోట్ల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పంపిణీ

పోలవరం నిర్వాసితులకు రూ.306 కోట్ల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పంపిణీ

📰 Generate e-Paper Clip

సీఎం చంద్రబాబు నాయకత్వంలో నిర్వాసితులకు న్యాయం చేస్తున్న కూటమి ప్రభుత్వం : ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి

అమరావతి/ గంగవరం, పెన్ పవర్, మే 16 :
పోలవరం నిర్వాసితుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. శుక్రవారం అమరావతిలో  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు ఆధ్వర్యంలో పోలవరం నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి మాట్లాడుతూ, గోదావరి జలాలకు ఆనకట్ట నిర్మాణానికి కృషి చేసిన మహనీయుడు జయంతి రోజున ప్యాకేజీ పంపిణీ చేయడం విశేషమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి వేగం పెరిగిందన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా రూ.306.61 కోట్ల ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ చెక్కులను నిర్వాసితులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. గతంతో పోలిస్తే నష్టపరిహారం మొత్తాన్ని పెంచి అందించడంతో నిర్వాసితులలో ఆనందం వ్యక్తమవుతోందన్నారు. ఇప్పటికే పునరావాస కాలనీలకు తరలిన కుటుంబాలకు ఇళ్ల తాళాలు అందించామని చెప్పారు.ఇళ్ల పట్టాల కోసం 62.05 ఎకరాలు, భూమికి భూమి కింద 520.02 ఎకరాలను ప్రభుత్వం గుర్తించినట్లు తెలిపారు. ఇప్పటివరకు నాలుగో విడత పరిహారం పంపిణీ జరుగుతుండగా, మొత్తం 29,936 మంది నిర్వాసితులకు రూ.2,250 కోట్లకు పైగా నిధులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.కార్యక్రమంలో ఎమ్మెల్యే శిరీష దేవి బాలరాజు , ట్రైకార్ చైర్మన్ బి.శ్రీనివాసులు, చింతూరు ఐటీడీఏ పీవో శుభం నొఖ్వాల్, మండల పార్టీ అధ్యక్షుడు ఎడవల్లి భాస్కరరావు, ఆర్‌అండ్‌ఆర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular