Homeఆంధ్రప్రదేశ్పోలవరం30న రంపచోడవరంలో మెగా జాబ్ మేళా

30న రంపచోడవరంలో మెగా జాబ్ మేళా

 

రంపచోడవరం, జూన్ 29 (పెన్ పవర్): పోలవరం జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మంగళవారం (జూన్ 30) రంపచోడవరం ఐటీడీఏ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 16 ప్రముఖ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. పదో తరగతి మరియు అంతకంటే పై చదువులు పూర్తి చేసిన యువతి, యువకులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్, కుల ధ్రువీకరణ పత్రాలు, జిరాక్స్ కాపీలతో హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 6304634447 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular