జీకే వీధి మండలం, దేవరపల్లి ఎంపీపీ స్కూల్కు చెందిన 11మంది విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన ఏకలవ్య 6వ తరగతి ప్రవేశ పరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు అభినందన కార్యక్రమం నిర్వహించనున్నట్లు మండల విద్యాశాఖ అధికారి-1 యు.ఏ. నరసింహారావు తెలిపారు.విద్యార్థుల కృషి,ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతో ఈ విజయం సాధ్యమైందని ఆయన పేర్కొన్నారు.ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించి అభినందించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఏకలవ్య పరీక్షలో ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందనలు
RELATED ARTICLES

