Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంగంగవరం విషాదం: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

గంగవరం విషాదం: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

 

 

గంగవరం విషాదం: బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 3 : గంగవరం తీరంలో జరిగిన విషాద ఘటనలో మృతి చెందిన కొత్త జాలారిపేటకు చెందిన యువతి సురకల నీతు కుటుంబాన్ని విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ సోమవారం పరామర్శించారు.

మృతురాలి కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చిన ఎమ్మెల్యే ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యురాలిని కోల్పోయిన వారి బాధలో తాము భాగస్వాములమని పేర్కొంటూ, ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

అనంతరం సంబంధిత పోలీసు అధికారులు, నేవీ సిబ్బందితో మాట్లాడిన ఎమ్మెల్యే, మృతదేహాన్ని వెలికితీసేందుకు అవసరమైన చర్యలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వ సహాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

ఈ సందర్భంగా వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, కుటుంబ సభ్యురాలిని కోల్పోవడం అత్యంత విషాదకరమని, బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటామని స్పష్టం చేశారు.

ఈ పరామర్శ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని బాధిత కుటుంబానికి తమ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular