ePaper
Wednesday, June 17, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అల్లూరి సీతారామరాజుప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తాం – అరకు ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తాం – అరకు ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి

📰 Generate e-Paper Clip

ప్రజల తరపున పోరాడటం, ప్రజా సమస్యలపై గొంతెత్తడం తమ పార్టీ ప్రాథమిక లక్ష్యమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ) భావిస్తోందని అరకు పార్లమెంట్ సభ్యురాలు డా. గుమ్మ తనూజ రాణి తెలిపారు.పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలో ప్రజల హక్కుల పరిరక్షణ, సంక్షేమ పథకాల అమలు, సామాజిక న్యాయం మరియు పేద వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్సీపీ కట్టుబడి పనిచేస్తోందన్నారు.కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, నిరుద్యోగ సమస్య, సంక్షేమ పథకాల కోతలు, శాంతిభద్రతల వైఫల్యాలు వంటి అంశాలపై ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని స్పష్టం చేశారు. అలాగే సామాజిక మాధ్యమాల వేదికగా కూడా ప్రజా సమస్యలను, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ ప్రజా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆమె పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular