గూడెం కొత్తవీధి,పెన్ పవర్,జూలై 5: ప్రత్యేక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఆదివారం మండలంలోని అన్ని గ్రామ సచివాలయాల్లో గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో బీహెచ్వీ రమణబాబు తెలిపారు. పెండింగ్లో ఉన్న ఎస్ఐఆర్ ఫారాలను పీసా కమిటీ సభ్యులు సేకరించి బీఎల్ఓలు లేదా గ్రామ సచివాలయ కార్యదర్శులకు అందించాలని కోరారు. అర్హులైన వారికి ఫారాలు అందకపోతే వారి వివరాలను సేకరించి నమోదు చేయించాలని సూచించారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేందుకు పీసా కమిటీలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు గ్రామసభలకు హాజరై సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

