Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిఅల్లూరి జయంతి ఘనంగా నిర్వహించిన వైసీపీ నేతలు

అల్లూరి జయంతి ఘనంగా నిర్వహించిన వైసీపీ నేతలు

నర్సీపట్నం, పెన్ పవర్ :

అల్లూరి శ్రీరామరాజు 129వ జయంతిని నర్సీపట్నంలో వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. వైయస్సార్ ట్యాంక్ బండ్ పై ఉన్న అల్లూరి విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ తమ నాయకులతో కలిసి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లూరి శ్రీరామరాజు చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. దేశ స్వాతంత్రం కోసం చిన్న వయసులోనే ప్రాణాలు అర్పించిన మహనీయుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు, పట్టణ పార్టీ అధ్యక్షుడు ఏకా శివప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, కోనేటి రామకృష్ణ, చెరుకూరి సత్యనారాయణ, తమరాన శ్రీను, సుర్ల నాయుడుబాబు, బేతిరెడ్డి విజయ్ కుమార్, దాడి బుజ్జి, అల్లంపల్లి లావణ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular