Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంSIR సర్వే విజయవంతానికి బూత్ అధ్యక్షులు కృషి చేయాలి - ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

SIR సర్వే విజయవంతానికి బూత్ అధ్యక్షులు కృషి చేయాలి – ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

 

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం జూలై 5: విశాఖ సౌత్ నియోజకవర్గ శాసనసభ సభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో సౌత్ నియోజకవర్గ వార్డ్ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, బూత్ అధ్యక్షులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ, SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) సర్వే ప్రాముఖ్యతను వివరించారు. ప్రతి బూత్ అధ్యక్షుడు సర్వేలో చురుకుగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బూత్ లెవల్ అధికారులకు (BLOలు) పూర్తి సహకారం అందించి SIR కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా సారథుల సమాచార కమిటీ దరఖాస్తుల స్వీకరణకు ఈరోజు చివరి రోజు కావడంతో, పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి జనసైనికుడు, వీరమహిళ, కార్యకర్త ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని కోరారు.ఈ సమావేశంలో సౌత్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్, మాజీ కార్పొరేటర్లు మహమ్మద్ షాదిక్, బిశెట్టి వసంతలక్ష్మి, మాసిపోగు రాజు, ఆళ్ల శ్రీనివాసరావు, సౌత్ నియోజకవర్గ జనసేన వార్డ్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular