Homeతెలంగాణపంట మార్పిడి విధానాన్ని పాటించాలి

పంట మార్పిడి విధానాన్ని పాటించాలి

గార్ల, పెన్ పవర్, జూలై 22:

పంట మార్పిడి విధానంతో అధిక దిగుబడులుసాధించేందుకు అవకాశం ఉందని రైతులు ప్రతి ఏటా మూస పద్ధతి లో ఒకే పంట ను సాగుచేయకుండా పంట మార్పిడి విధానాలు అవలంభించాలని మండల వ్యవసాయ అధికారి కావటి రామారావు కోరారు. గార్ల మండల పరిధిలోని పెద్ద కిష్టాపురం గ్రామ పంచాయతీ కార్యాలయం లో సర్పంచ్ రాంసింగ్ అధ్యక్షతన బుధవారం రైతు అవగాహన కార్యక్రమం నిర్వహించారు రైతులకు అవగాహన కల్పించారు అనంతరం ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి ని విధిగా అవలంభించాలని ప్రతి యేటా రసాయన ఎరువుల ను అధిక మొత్తం లో వాడటం వలన నేల చౌడు బారి పంటలకు ప్రతి కూలం గా మారే అవకాశం ఉన్నదని రైతులు సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా బూసారం పెరగడం తో పాటుగా నేల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని ఆరోగ్య కర మైన పంటలు పండుతాయని రైతులు రసాయన ఎరువులు మితం గా వాడుతూ సేంద్రియ జీవన ఎరువులు విరివిగా వాడాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఏ ఈ ఓ మేఘన గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular