Homeతెలంగాణహనుమకొండరాహుల్ గాంధీ అరెస్ట్ బిజెపి నియంతృత్వానికి నిదర్శనం

రాహుల్ గాంధీ అరెస్ట్ బిజెపి నియంతృత్వానికి నిదర్శనం

గార్ల, పెన్ పవర్, జులై 22:

ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలుపుతున్న రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ లను అరెస్టు చేయడం బిజెపి పార్టీ నియంతృత్వానికి నిదర్శనమని ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య అన్నారు. రాహుల్ గాంధీ అక్రమ అరెస్టులను ఖండిస్తూ బుధవారం కాంగ్రెస్ పార్టీ గార్ల మండల అధ్యక్షులు తాళ్లపల్లి కృష్ణ ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక నెహ్రూ సెంటర్ లో నిర్వహించిన ధర్నాలో గార్ల సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ తో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీ తో లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో విద్యార్థులు యువజన సంఘాలు చేపట్టిన నిరసనలకు మద్దతుగా నిలిచిన లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎంపి ప్రియాంక గాంధీ, మరి కొంతమందిని అరెస్టు చేయడమే కాకుండాకేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించకుండా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులపై పోలీసు బలగాలను ప్రయోగించడం అత్యంత దురదృష్టకరమన్నారు.
పేపర్ లీకేజీపై కేంద్రాన్ని ప్రశ్నించినందుకే ఈ అరెస్టులు జరిగాయని, ఇది అప్రజాస్వామికమని కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి అణచివేత చర్యలకు పాల్పడుతోందని, ప్రశ్నించే గొంతులను అణచివేయడం మానుకొని విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు మాజీ కమిటీ చైర్మన్ భూక్యా నాగేశ్వరరావు సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు గంగావత్ రామ్ సింగ్, గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ పార్వతి హతిరాం, మర్రిగూడెం సర్పంచ్ భూక్యా రామ్ సింగ్, ములకనూరు సర్పంచ్ వెంకట్రావు, మాజీ జెడ్పిటిసి జాటోత్ ఝాన్సీలక్ష్మి, ఉప సర్పంచులు మహమ్మద్ జరీనా బేగం, శ్రీనివాస్ శివకృష్ణ, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు అందనాలా రాజీవ్ నాయుడు, కాంగ్రెస్ పార్టీ మండల పాలిత్య కిషన్, షేక్ యాకూబ్ పాషా, కట్ట శ్రీనివాస్, బానోత్ మల్లిబాబు, పళ్ళ నరసయ్య, కోళ్ల కుమార్ గౌడ్, భూక్యా అశోక్, హతీరామ్, భూక్యా బాబూలాల్, పటాన్ ఇమ్రాన్ ఖాన్, రమేష్ వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular