Homeతెలంగాణగార్లలో అవగాహన సదస్సు నిర్వహించాలి: డీఎస్పీని కోరిన కాంగ్రెస్‌ నాయకులు

గార్లలో అవగాహన సదస్సు నిర్వహించాలి: డీఎస్పీని కోరిన కాంగ్రెస్‌ నాయకులు

 

గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 5:

యువత గంజాయి, గుట్కా, మత్తు పదార్థాలు, ఇతర మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా విస్తృతంగా అవగాహన కల్పించాలని కాంగ్రెస్‌ నాయకులు కోరారు. ఈ మేరకు శనివారం మహబూబాబాద్ జిల్లా డీఎస్పీ తిరుపతిరావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. గార్ల మండలంలోని వివిధ గ్రామాల్లో యువత, విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని డీఎస్పీని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో యువత చెడు అలవాట్ల బారిన పడకుండా పోలీసుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, మీ అమూల్యమైన సందేశంతో యువతలో చైతన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం కావడంతో పాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. గ్రామస్థాయిలోనే మాదక ద్రవ్యాల వ్యసనాన్ని అరికట్టేందుకు పోలీసు శాఖ, ప్రజాప్రతినిధులు, యువజన సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో చిన్న బంజార సర్పంచ్ బానోత్ మోతిలాల్ నాయక్, మహబూబాబాద్ జిల్లా యూత్ నాయకుడు షేక్ యాకూబ్ పాషా, పుల్లూరు మాజీ సర్పంచ్ జాటోత్ రమేష్ నాయక్, మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ నాయకులు భూక్యా బాబులాల్ నాయక్, కోలా రిత్విక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular