Homeఆంధ్రప్రదేశ్అమరావతిజగన్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన మొల్లి అప్పారావు

జగన్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన మొల్లి అప్పారావు

జగన్‌ను కలిసి వివాహ ఆహ్వాన పత్రిక అందజేసిన మొల్లి అప్పారావు

  బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్     విశాఖపట్నం, జూలై 29 : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు Y. S. Jagan Mohan Reddyను తాడేపల్లిలోని ఆయన నివాసంలో విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు కుటుంబ సమేతంగా మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఆగస్టులో జరగనున్న తన కుమార్తె వివాహానికి హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరుతూ వివాహ ఆహ్వాన పత్రికను జగన్‌కు అందజేశారు. దీనిపై స్పందించిన జగన్, తప్పకుండా వివాహానికి హాజరయ్యేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

అనంతరం విశాఖ తూర్పు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, కార్యకర్తలు, నాయకుల యోగక్షేమాల గురించి మొల్లి అప్పారావును అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ఈ భేటీ ఆత్మీయ వాతావరణంలో జరిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular