Homeతెలంగాణసైబర్ నేరాల కట్టడికి అప్రమత్తత, అవగాహనే ఆయుధం

సైబర్ నేరాల కట్టడికి అప్రమత్తత, అవగాహనే ఆయుధం

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 5:

సైబర్ నేరాల కట్టడికి అప్రమత్తత, అవగాహనే ఆయుధమని గార్ల బయ్యారం సీఐ ఎల్ రవీందర్ అన్నారు.సైబర్ జాగృతి దివస్ సందర్భంగా సురక్ష కా తిరంగా సైబర్ స్వతంత్ర తెలంగాణ వైపు నినాదంతో మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్ డాక్టర్ రాజు అధ్యక్షతన బుధవారం సైబర్ క్రైమ్ నేరాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూడిజిటల్ యుగంలో సాంకేతిక పరిజ్ఞానం మానవ జీవితాన్ని సులభతరం చేసినప్పటికీ, అదే సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సైబర్ నేరగాళ్లురెచ్చిపోతున్నారన్నారని యూపీఐ, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ వాలెట్లు, ఆన్లైన్ కొనుగోళ్లు, సామాజిక మాధ్యమాల వినియోగం విస్తరించడంతో సైబర్ నేరాలకు అవకాశాలు పెరిగాయన్నారు.బ్యాంకు ఖాతా వివరాలు, ఒటీపీ, యూపీఐ పిన్, సీవీవీ సంఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పకూడదని తెలియని లింక్ లను నొక్కకూడదన్నారు. నకిలీ వెబ్సైట్లు, నకిలీ మొబైల్ యాప్లు, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రకటనలు, ఉద్యోగాల పేరుతో మోసాలు, పెట్టుబడుల పేరుతో మోసాలు, డిజిటల్ అరెస్టు పేరుతో బెదిరింపులు, ఓటీపీలు, యూపీఐ అభ్యర్థనలు, క్యూఆర్ కోడ్ల ద్వారా డబ్బు దోచుకునే కొత్త పద్ధతులు విస్తృతంగా పెరిగాయని వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సైబర్ నేరాలు జరిగితే బాధితులు వెంటనే టోల్-ఫ్రీ నంబర్ 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని, ఇది 24 గంటలూ పనిచేస్తుందన్నారు.అనంతరం విద్యార్థులతో సైబర్ నేరాల నిర్మూలనకు ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో గార్ల ఎస్సై సాయికుమార్ ఏఎస్ఐ వెంకట్ రెడ్డి పోలీస్ సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular