Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంవైయస్సార్‌సీపీ దీక్షా శిబిరాలపై వెన్నుపోటు పార్టీ దాడులు

వైయస్సార్‌సీపీ దీక్షా శిబిరాలపై వెన్నుపోటు పార్టీ దాడులు

 

వైయస్సార్‌సీపీ దీక్షా శిబిరాలపై వెన్నుపోటు పార్టీ దాడులు

వెన్నుపోటు పార్టీ గుండాల వ్యవహారశైలి అత్యంత హేయం

:మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ

విజయవాడలో వెన్నుపోటు పార్టీ ఉన్మాదానికి పరాకాష్ట

మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి

రాష్ట్రమంతా దీక్షా శిబిరాలపై పోలీసుల దమనకాండ

అప్రజాస్వామికంగా శిబిరాల తొలగింపు. దాడుల పర్వం

మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ ధ్వజం

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగష్టు 6 :
శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వైయస్సార్‌సీపీ శ్రేణులపై అధికార వెన్నుపోటు పార్టీ దాడులు చేయించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిర్వహిస్తున్న దీక్షా శిబిరంపైకి వెన్నుపోటు పార్టీ గుండాలు దూసుకొచ్చి టెంట్లు లాగిపడేసి, వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మహిళలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడికి తెగబడడం అత్యంత హేయం. వారిని అడ్డుకోవాల్సిన పోలీసులు, తిరిగి మా పార్టీ నాయకులనే అరెస్టు చేశారు. మల్లాది విష్ణుగారిని పోలీస్‌ వ్యాన్‌లో తరలిస్తుండగా, వెన్నుపోటు పార్టీ మహిళా కార్యకర్త ఒకరు పార్టీ జెండా కర్రతో ఆయనపై దాడి చేయడం, రాష్ట్రంలో పూర్తిగా దిగజారిన శాంతి భద్రతలకు, పోలీస్‌ వ్యవస్థ దిగజారుడుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇంకా విజయవాడలో దీక్షా శిబిరంలోని టెంట్‌పై వెన్నుపోటు పార్టీ కార్యకర్త ఒకరు మూత్ర విసర్జన చేయడం ఆ పార్టీ ఉన్మాద ఆలోచనలకు, వారి చేష్టలకు అద్దం పడుతోంది. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న నిరసనలను అణచి వేయాలని వెన్నుపోటు పార్టీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవు.
డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించడంతో పాటు, ఆ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ, మంత్రి నారా లోకేష్‌ రాజీనామా చేయాలి. ఇదే అంశంపై వైయస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలపై వెన్నుపోటు పార్టీ నేతలు దాడులకు పాల్పడ్డారు. ఇంకా చాలాచోట్ల పోలీసులను ఉపయోగించి, దీక్షా శిబిరాలు ధ్వంసం చేశారు. వెన్నుపోటు పార్టీ చేస్తున్న ఈ అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. మాపై ఎన్ని దౌర్జన్యాలు చేసినా, మా ఆందోళన బాట వీడబోము. మా పోరాటం కొనసాగుతుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular