Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంమోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ పాదయాత్ర ప్రారంభం

మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ పాదయాత్ర ప్రారంభం

 

 

మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సీపీఐ పాదయాత్ర ప్రారంభం

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 6: “మోదీని సాగనంపుదాం – దేశాన్ని రక్షించుకుందాం, దేశంలో మార్పు కావాలి” అనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో ఆగస్టు 6 నుంచి 15 వరకు నిర్వహిస్తున్న దేశవ్యాప్త పాదయాత్రలు భీమిలి నియోజకవర్గంలోని తగరపువలసలో ప్రారంభమయ్యాయి.

అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ప్రారంభమైన ఈ పాదయాత్రలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఎ. విమల, రాష్ట్ర సమితి సభ్యుడు ఎం. పైడిరాజు, జిల్లా కార్యదర్శి ఎస్.కె. రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశామని తెలిపారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు, కార్మిక హక్కుల పరిరక్షణ, రైతులకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, విశాఖలో ఆర్‌ఆర్‌బీ కేంద్రం ఏర్పాటు, డేటా సెంటర్ల వల్ల పర్యావరణ నష్టాన్ని అరికట్టడం, తగరపువలసలో ఆర్టీసీ కాంప్లెక్స్ నిర్మాణం తదితర డిమాండ్లను వారు ప్రస్తావించారు. అలాగే సెప్టెంబర్ 1న “చలో ఢిల్లీ” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular