*మెగా హీరోలు ప్రయాణించిన కారు ఎవరిది!*
*సోషల్ మీడియాలో వైరల్*

బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్
విశాఖపట్నం, ఆగస్టు 9:_ టాలీవుడ్ అగ్రశ్రేణి నటులు రాంచరణ్ తేజ్, అల్లు అర్జున్ లు వినియోగించిన కారు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో, అభిమానుల్లో విస్తృత చర్చ జరుగుతోంది. మంగళగిరి స్టేడియంలో జూన్ నెలలో జరిగిన ఏపీఎల్ మ్యాచ్ లో రాంచరణ్ ప్రయాణించిన ఏపీ 40 ఎల్ఈ 1 ల్యాండ్ క్రూయిజర్ కారులోనే ఆదివారం అల్లు అర్జున్ విశాఖ ఇన్ ఆర్బిట్ మాల్ లోని ఏఏఏ థియేటర్ల ప్రారంభోత్సవానికి రావడంతో ఆ కారు గురించి అనేకమంది ఇప్పుడు ఆరా తీస్తున్నారు. ఈ కారు మెగాస్టార్ చిరంజీవికి, ఆయన కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన భీమిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుది. మెగా కుటుంబ సభ్యులెవరు విశాఖ వచ్చినా గంటా వారికి ఆత్మీయ ఏర్పాట్లు చేస్తుంటారు. “ఇద్దరు హీరోలు ఒకే కారులో ప్రయాణించారు. అనుబంధం అంతర్గతంగా ఎప్పుడూ ఉంటుంది. అభిమానులు ఫ్యాన్ వార్ లు పక్కన పెట్టాలి” అని సోషల్ మీడియాలో ఇద్దరు హీరోలు ప్రయాణించిన కారు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

