వేటపాలెం, సెప్టెంబర్ 25 : పట్టభద్రుల సంఘం ఆధ్వర్యంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న కుమారి పి. లక్ష్మీ హాసినికి ఆర్థిక సహాయం అందించారు. ఉన్నత విద్య కొనసాగించేందుకు ఆమె చేసిన విజ్ఞప్తి మేరకు సంఘం తరఫున రూ.6 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ప్రత్తి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యను పూర్తి చేసి, భవిష్యత్తులో వైద్య వృత్తిలో సేవాతత్పరతతో పనిచేయాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విద్యాభ్యాసం కొనసాగించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం సంఘం ప్రధాన ఆశయమని తెలిపారు. కార్యక్రమంలో సంఘ సభ్యులు నున్నా శివప్రసాద్, మురళీకృష్ణ, రాజేంద్రప్రసాద్, శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.

