Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నందిశ యాప్ రద్దు మహిళల భద్రతకు విఘాతం: ఆడారి దివ్య కళ

దిశ యాప్ రద్దు మహిళల భద్రతకు విఘాతం: ఆడారి దివ్య కళ

దిశ యాప్ రద్దు మహిళల భద్రతకు విఘాతం: ఆడారి దివ్య కళ

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్        విశాఖపట్నం, ఆగస్టు 13: మహిళల భద్రత కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ యాప్‌ను రద్దు చేయడాన్ని విశాఖపట్నం జిల్లా పార్టీ అధికార ప్రతినిధి ఆడారి దివ్య కళ తీవ్రంగా ఖండించారు. మహిళల రక్షణకు ఉపయోగపడుతున్న దిశ యాప్‌ను రద్దు చేయకుండా మరింత బలోపేతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

మహిళలు అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించేందుకు, ప్రమాదంలో ఉన్న వారికి త్వరితగతిన సహాయం అందించేందుకు దిశ యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉండేదని ఆమె తెలిపారు. రాష్ట్రంలో సుమారు 1.51 కోట్ల మంది మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ప్రజల్లో దానిపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమన్నారు.

మహిళల భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన సమయంలో ఉన్న వ్యవస్థను తొలగించడం సరైన నిర్ణయం కాదని ఆడారి దివ్య కళ పేర్కొన్నారు. దిశ యాప్‌లో ఉన్న సాంకేతిక సదుపాయాలను మరింత ఆధునీకరించి, అత్యవసర సమయంలో మహిళలకు తక్షణ పోలీసు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

దిశ యాప్ పేరును మార్చి మరో పేరుతో కొత్త యాప్‌ను తీసుకొచ్చినంత మాత్రాన మహిళల భద్రతకు సంబంధించిన అసలు ఉద్దేశం నెరవేరదన్నారు. ‘‘పేరు మార్చడం కాదు.. మహిళలకు భద్రత కల్పించడం ముఖ్యం’’ అని స్పష్టం చేశారు.

మహిళలపై నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళలు ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వం తమకు అండగా ఉందనే నమ్మకం కలిగేలా భద్రతా చర్యలు ఉండాలన్నారు.

దిశ యాప్‌ను రద్దు చేసే నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించి, మహిళల భద్రత కోసం యాప్‌ను కొనసాగించడంతో పాటు మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దాలని ఆడారి దివ్య కళ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular