గార్ల, పెన్ పవర్, ఆగస్టు 25:
మోడీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశాడని అఖిల భారత యువజన సమాఖ్య మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి జలగం ప్రవీణ్ అన్నారు.గార్ల మండల పరిధిలోని మద్దివంచ గ్రామంలో మంగళవారం ధూపాటి ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించిన మహాసభకు ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడారు విభజన హామీ చట్టంలో బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని చెప్పి నాణ్యత లేదని దాటవేస్తూ ఇంతవరకు పరిశ్రమను ఏర్పాటు చేయలేదని అన్నారు బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తే మహబూబాబాద్ జిల్లా ప్రజలకు సుమారు 20వేల మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు బిజెపి ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉండి రాష్ట్ర హక్కులను ఢిల్లీలో అడగడంలో పూర్తిగా విఫలమయ్యారని రానున్న కాలంలో అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగాల కోసం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు కోసం ఉద్ధృతంగా ఉద్యమాలు చేస్తామన్నారు ఈనెల 27వ తారీఖున అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జిల్లా మహాసభ జరుగుతుందని గార్ల మండలం నుంచి యువతి యువకులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఏ ఐ వై ఎఫ్ గార్ల మండల నూతన కమిటీ ఎన్నికలను నిర్వహించగా, అధ్యక్షుడిగా బాదం రాజేష్, కార్యదర్శిగా ఇరుగు వెంకటేష్ తో పాటుగా 9 మంది సభ్యులతో కమిటీ వేసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులు మాట్లాడుతూ యువజన సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంత యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాగం లోకేష్ తోకల ఉదయ్ బాబు రాంబాబు వేణు శ్రీకాంత్ అనిల్ రమేష్ భూక్య హరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.

