Homeతెలంగాణఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ మండల నూతన కమిటీ ఎన్నిక

 

గార్ల, పెన్ పవర్, ఆగస్టు 25:

గార్ల మండల కేంద్రంలోని స్థానిక వర్తక సంఘం భవనంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్‌చార్జ్ ఇరుగు రవి అధ్యక్షతన మంగళవారం ఎమ్మార్పీఎస్ మండల కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జ్ జన్ను దినేష్ మాదిగ జిల్లా కన్వీనర్ కందిపాటి బిక్షపతి లు హాజరై మాట్లాడారు ఎమ్మార్పీఎస్‌ను గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేస్తూ, మాదిగల హక్కులు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పనిచేయాలని కోరారు అనంతరంనూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడిగా బాషి పంగు జయరాజ్ మాదిగ, మండల అధికార ప్రతినిధిగా దేశపాక మురళీకృష్ణ మాదిగలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన కమిటీకి ఎమ్మార్పీఎస్ నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ కురవి మండల ఇన్‌చార్జ్ దూడపంగు శ్రీనివాసరావు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గిన్నారపు మురళి, తారక రామారావు, గార్ల మండల కో ఇన్‌చార్జ్ పుల్లూరు వెంకటేశ్వర్లు, సీనియర్ నాయకులు ఇల్లుటూరి శీను, కాంపటి వీరన్న, చిలుకూరి పెద్ద వెంకన్న, జల్లా శ్రీను, జిల్లా విశ్వనాథం, ఇమ్మడి వెంకన్న, ఏలూరి సాయి, అందే అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular