Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లిపేదల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్సార్

పేదల గుండెల్లో చిరస్మరణీయుడు వైయస్సార్

వర్ధంతి సభలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు 

నర్సీపట్నం , పెన్ పవర్ :

నర్సీపట్నంలో స్వర్గీయ వైయస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల సన్యాసిపాత్రుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వైయస్సార్ అమర్ రహే అంటూ కొద్దిసేపు నినాదాలు చేశారు. అనంతరం సన్యాసిపాత్రుడు మీడియాతో మాట్లాడుతూ దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన ఏడేళ్ల పాలనలో పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆయన మరణ వార్త విని ఎన్నో గుండెలు ఆగిపోయాయని గుర్తు చేసుకున్నారు. ఆయన సృష్టించిన అనే సంక్షేమ పథకాలలో ఆరోగ్యశ్రీ, ఉచిత వైద్య విద్య, 108, 104, వంటివి కొన్ని మచ్చు తునకలని వివరించారు. రానున్న రోజుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ని ముఖ్యమంత్రిని చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ లో రాజన్న రాజ్యాన్ని స్థాపించాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులకు సన్యాసిపాత్రుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, పట్టణ ప్రముఖ వైద్యులు పి. రాజశేఖర్, మల్ల గణేష్, తమరాన శ్రీనివాసరావు, బేతిరెడ్డి విజయ్ కుమార్,  గణమ్మ , దాడి బుజ్జి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular