గూడెంకొత్తవీధి, పెన్ పవర్, సెప్టెంబర్ 5: గూడెంకొత్తవీధి మండలం పెదవలస పంచాయతీ డొకులూరు గ్రామానికి చెందిన బొలెరో ప్రమాద క్షతగాత్రులను వైసీపీ మండల నాయకులు శనివారం పాడేరు జిల్లా ఆస్పత్రిలో పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యుల సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉండాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు కంకిపాటి గిరిప్రసాద్, బొబ్బిలి లక్ష్మణ్, వసుపరి తిమోతి, వనపల రాజేష్, వంతల చంటిబాబు అంజి,నారాయణ తో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.
డొకులూరు ప్రమాద క్షతగాత్రులకు వైసీపీ నేతల పరామర్శ
RELATED ARTICLES

