Homeతెలంగాణఖమ్మంసెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో ఘనంగా టీచర్స్‌ డే వేడుకలు

సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో ఘనంగా టీచర్స్‌ డే వేడుకలు

ఖమ్మం, పెన్ పవర్, సెప్టెంబర్‌ 5:
ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని వరంగల్‌ క్రాస్‌ రోడ్డులో గల సెయింట్‌ జోసెఫ్‌ పాఠశాలలో శనివారం ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత మాజీ రాష్ట్రపతి, ప్రముఖ విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సత్కరించి గురువుల పట్ల తమకున్న గౌరవం, కృతజ్ఞతను చాటుకున్నారు. అనంతరం చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈకార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్‌ సిస్టర్‌ ప్రశాంతి, సెక్రటరీ సిస్టర్‌ ఫ్రాన్స్ కో, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular