రాజమహేంద్రవరం, పెన్ పవర్, స్టాఫ్ రిపోర్టర్, సెప్టెంబర్ 5:
తూర్పు గోదావరి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఏడుగురు సివిల్ కానిస్టేబుల్స్‌కు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి కల్పిస్తూ ఎస్పీ డి.నరసింహ కిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ డి.నరసింహ కిషోర్ ని మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేసి, కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ పదోన్నతి పొందిన మోకా మల్లిఖార్జున స్వామి,
కందుకూరి రిషి కుమార్, పితాని శ్రీనివాసరావు, చిలకా పోసిబాబు, చింతా ఉమామహేశ్వరరావు, రాచర్ల సుగుణ కుమార్, సోమిశెట్టి వెంకట రమణ లను హృదయపూర్వకంగా అభినందించారు.
ఏడుగురు సివిల్ కానిస్టేబుల్స్‌కు హెడ్ కానిస్టేబుల్స్‌గా పదోన్నతి
RELATED ARTICLES

