Homeతెలంగాణఅంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత

అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేత

 

గార్ల, పెన్ పవర్, సెప్టెంబర్ 8:

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు హేయమైన చర్య అని మాజీ జెడ్పిటిసి చైర్పర్సన్ ఆంగోత్ బిందు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను నిరసిస్తూ బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం గార్ల మండల కేంద్రంలోని స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన ఎన్నికల హామీలను అమలు చేయలేదన్నారు. వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లలో అనేకం నేటికీ అమలు కాలేదని విమర్శించారు. రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, తులం బంగారం, నిరుద్యోగ భృతి వంటి హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు.ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేసే ప్రయత్నాలు చేసినా బీఆర్‌ఎస్ శ్రేణులు వెనక్కి తగ్గబోవని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హామీలను ప్రతి గడపకూ తీసుకెళ్లి ప్రజలకు వాస్తవాలను వివరిస్తామని, ప్రజల పక్షాన పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలిపారు.ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేసే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందనిపేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు గంగావత్ లక్ష్మణ్ నాయక్ మాజీ ఎంపిటిసి శీలంశెట్టి రమేష్ బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు రాధాకృష్ణ అనిల్ శ్రీనాథ్ మహేష్ ఉమేష్ చంటి ఆజాద్ నరసింహ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular