Homeఆంధ్రప్రదేశ్కాకినాడమున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అమలు వేగవంతం.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అమలు వేగవంతం.

 

*ఒక్కొక్క రోజు గడువులో అంతా చకాచకా.

ఏలేశ్వరం, పెన్ పవర్, సెప్టెంబర్ 9: మున్సిపల్ పరిపాలన కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆదేశాల మేరకు రీజనల్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారి సిహెచ్ నాగ నరసింహారావు ఏలేశ్వరం మున్సిపల్ ఆఫీసుకు బుధవారం విచ్చేశారు. ఏలేశ్వరం పురపాలక సంఘంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై ఆర్డిఎంఏ ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించారు . బీసీ ఎస్సీ ఎస్టీ, మహిళా ఓటర్ల జాబితా పై సర్వే నిర్వహించారు.పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, డ్రాఫ్ట్ ప్రచురణ తదితర ఎన్నికల సంబంధిత అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

 

అనంతరం ఏలేశ్వరం పురపాలక సంఘ కార్యాలయంలో సంబంధిత సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి, ఎన్నికల ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. అనంతరం స్థానిక విలేకరులతో నరసింహారావు మాట్లాడుతూ ఎం ఏ సి డ ఆదేశాల మేరు ఒక్కొక్క రోజు గడువులో అంతా చకాచకా ఎన్నికల ఎన్నికల షెడ్యూల్ సాగిపోతుందన్నారు. ఏలేశ్వరం మున్సిపాలిటీలో మొత్తం 25 వేల 472 మంది వాటర్ లో ఉన్నారని, వీరిలో మహిళలు 13350 మంది, పురుషులు 12,118 మంది ఓటర్లు ఉన్నారన్నారు.
28 వార్డులు 35 పోలింగ్ స్టేషన్లో
బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల రిజర్వేషన్ కోసం క్రాస్ చెక్ చేయడానికి వచ్చానన్నారు. రెండు కిలోమీటర్ల పరిధిలో ఓటర్ బూత్ ఏర్పాటు చేయాలనే ఎన్నికల నిబంధన ఉన్నందున బీసీలకు-2, ఎస్సీలకు-1 మొత్తం మూడు పోలింగ్ స్టేషన్లను ఈరోజు పరిశీలించమన్నారు. స్థానిక పెద్ద వీధి, దిబ్బల పాలెం గవర్నమెంట్ హై స్కూల్, అంబేద్కర్ నగర్ ప్రక్కన ఉన్న సీతారామరాజు నగర్ జడ్పీ స్కూల్లో మొత్తం మూడు పోలీస్ స్టేషన్ కేంద్రాలను పరిశీలించామన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ ఉమెన్ 50% రిజర్వేషన్లో సెప్టెంబర్ 8 నుండి 12వ తేదీ వరకు రిజర్వేషన్ పై నివేదిక ఇవ్వవలసి ఉందన్నారు. 20 వార్డులు ఉన్న నగర పంచాయతీని నూతనంగా 28 వార్డులుగా విభజించడం జరిగిందని అందువల్ల 35 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామన్నారు.
సెప్టెంబర్ 21 కు రిజర్వేషన్లు ఫైనల్ అవుతాయి అన్నారు. ఈ నెల 10న డ్రాఫ్ట్ పబ్లిష్ చేస్తారు. 11న అబ్జెక్షన్స్ను స్వీకరిస్తారు. అదే రోజు పొలిటికల్ పార్టీల మీటింగ్, 12న ఫైనలైజ్ చేస్తారు. 13న అప్రూవల్ కోసం కలెక్టర్కు నివేదిస్తారు. అదే రోజు కలెక్టర్ సీఎంకు నివేదించడం జరుగుతుందని ఎం ఏ సి డి నరసింహారావు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular