చంద్రబాబు అరెస్టును గుర్తుచేసుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన
53 రోజుల నిర్బంధం అనంతరం న్యాయం గెలిచిందన్న టీడీపీ శ్రేణులు
గంగవరం, పెన్ పవర్, సెప్టెంబర్ 9:
గంగవరం మండలం మోహనాపురం గ్రామంలో బుధవారం “నిజం గెలిచింది” కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మూడేళ్ల క్రితం అరెస్టయిన ఘటనను గుర్తుచేసుకుంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు.ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడిని అసత్య కేసులో చట్టవిరుద్ధంగా నిర్బంధించారని ఆరోపించారు. ఆయన అరెస్టు అనంతరం రాష్ట్ర ప్రజలతో పాటు దేశ, విదేశాల్లోని తెలుగు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతుగా నిలిచారని తెలిపారు. 53 రోజుల పాటు జైలు జీవితం అనుభవించిన అనంతరం చంద్రబాబు నాయుడు విడుదల కావడం, న్యాయపరమైన పరిణామాల్లో ఆయనకు ఊరట లభించడం ద్వారా చివరకు నిజమే గెలిచిందని పేర్కొన్నారు.
చీకటి రోజులను గుర్తుచేసుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన
నాటి పరిణామాలను గుర్తుచేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా “నిజం గెలిచింది” కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా మోహనాపురంలో కొవ్వొత్తులు వెలిగించి నిరసన కార్యక్రమం చేపట్టారు.ప్రజాస్వామ్యంలో సత్యం, న్యాయం చివరకు విజయం సాధిస్తాయనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కార్యక్రమం ఉద్దేశమని నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబుకు అండగా నిలిచిన తెలుగు ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు తెలిపారు.కార్యక్రమంలో ఐదవ యూనిట్ ఇన్‌చార్జి, మాజీ ఎంపీపీ డాక్టర్ తీగల ప్రభ, కో-యూనిట్ ఇన్‌చార్జి, మాజీ జడ్పీటీసీ మద్దేటి వెంకటరెడ్డి, మండల రైతు అధ్యక్షుడు మధువీటి శివరామ భూపతి దేవ్, మోహనాపురం గ్రామ కమిటీ అధ్యక్షుడు రేవుల రామాంజనేయరెడ్డి, ఎండపల్లి గ్రామ కమిటీ అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ నర్సి సూరమ్మ, పండ్రప్రోలు మాజీ సర్పంచ్ మడకం సత్యవతి, నాయకులు వెంకటగిరి, రేవుల అబ్బాయిరెడ్డి, మంగా శ్రీ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

