- స్టాఫ్ రిపోర్టర్, పాడేరు, పెన్ పవర్, సెప్టెంబర్ 22అల్లూరి సీతారామరాజు జిల్లాకు రెడ్ అలర్ట్ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ప్రాథమిక పాఠశాలలకు సెప్టెంబర్ 23న సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ టి. నిశాంతి తెలిపారు.విద్యార్థుల భద్రత దృష్ట్యా రెసిడెన్షియల్ పాఠశాలల్లోని విద్యార్థులు బయటకు వెళ్లకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు, ప్రజలు అప్రమత్తంగా ఉండి జిల్లా యంత్రాంగం సూచనలు పాటించాలని కలెక్టర్ కోరారు.
రెడ్ అలర్ట్ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలలకు రేపు సెలవు
RELATED ARTICLES

