Homeఆంధ్రప్రదేశ్కాకినాడభారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

24×7 జిల్లా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు.. నిరంతర పర్యవేక్షణ

కాకినాడ, పెన్ పవర్,సెప్టెంబర్ 23: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కాకినాడ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని జిల్లా కలెక్టర్‌ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్‌ తెలిపారు.

ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు కాకినాడ కలెక్టరేట్‌లో 24×7 జిల్లా కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో వర్షపాతం, రిజర్వాయర్లు, చెరువులు, డ్రైనేజీలు, లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు, రహదారుల పరిస్థితిని సంబంధిత శాఖల సమన్వయంతో కంట్రోల్‌ రూమ్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

వర్షాలు, వరదలు, చెట్లు పడిపోవడం, రహదారులపై ఆటంకాలు, ఇళ్లు లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం, అత్యవసర తరలింపు అవసరం వంటి పరిస్థితులు ఎదురైతే ప్రజలు వెంటనే కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందించాలని సూచించారు.

జిల్లా కంట్రోల్‌ రూమ్‌ ఫోన్‌ నంబర్లు:
📞 ల్యాండ్‌లైన్‌: 0884-2356801
📱 మొబైల్‌: 9849903879
📱 కాకినాడ ఆర్‌డీఓ కంట్రోల్‌ రూమ్‌: 8008803208

లోతట్టు, వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు, సహాయక చర్యలు చేపట్టేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా యంత్రాంగం తెలిపింది. భారీ వర్షాల సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లా యంత్రాంగం జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular