Homeఆంధ్రప్రదేశ్కాకినాడసైక్లోన్‌ ప్రభావంతో కాజులూరులో కంట్రోల్‌ రూం ఏర్పాటు

సైక్లోన్‌ ప్రభావంతో కాజులూరులో కంట్రోల్‌ రూం ఏర్పాటు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తహశీల్దార్‌ ఠాగూర్‌

కాజులూరు, పెన్‌పవర్‌, సెప్టెంబర్‌ 22: సైక్లోన్‌ ప్రభావంతో అధిక వర్షాలు, ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో కాజులూరు మండల కేంద్రంలో సెప్టెంబర్‌ 22 నుంచి 25వ తేదీ వరకు కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు తహశీల్దార్‌ జి.ఆర్‌. ఠాగూర్‌ తెలిపారు. కాకినాడ ఆర్డీవో ఆదేశాల మేరకు కంట్రోల్‌ రూంలో వీఆర్వోలకు షిఫ్టుల వారీగా విధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్‌ రూంను సంప్రదించాలని సూచించారు.
కంట్రోల్‌ రూం విధుల వివరాలు ఇలా ఉన్నాయి. సెప్టెంబర్‌ 22 రాత్రి 8 గంటల నుంచి 23వ తేదీ ఉదయం 8 గంటల వరకు కొలంక వీఆర్వో పి.సూర్యనారాయణ మూర్తి (ఫోన్‌: 9849993646), 23వ తేదీ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కాజులూరు వీఆర్వో కె.వి.సుబ్బారెడ్డి (ఫోన్‌: 9533772444), రాత్రి 8 నుంచి 24వ తేదీ ఉదయం 8 గంటల వరకు శలపాక వీఆర్వో ఎం.శ్రీరాములు (ఫోన్‌: 8309300839) అందుబాటులో ఉంటారు.
24వ తేదీ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు శీల వీఆర్వో డి.సుబ్రహ్మణ్యం (ఫోన్‌: 9440913620), రాత్రి 8 నుంచి 25వ తేదీ ఉదయం 8 గంటల వరకు బంధనపూడి వీఆర్వో కె.శ్రీనివాస్‌ (ఫోన్‌: 9553464285), 25వ తేదీ ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు కాజులూరు వీఆర్వో వి.ఎస్‌.కుమార్‌ (ఫోన్‌: 9985570778), రాత్రి 8 నుంచి 26వ తేదీ ఉదయం 8 గంటల వరకు అండ్రంగి వీఆర్వో కె.లోవమూర్తి (ఫోన్‌: 7330843817) విధుల్లో ఉంటారు.వీఆర్వోలు తమకు కేటాయించిన సమయాల్లో కంట్రోల్‌ రూంలో విధులు నిర్వర్తిస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్‌, ఆర్డీవో కార్యాలయాల నుంచి అందే సమాచారాన్ని రిజిస్టర్‌లో నమోదు చేసి, ఎప్పటికప్పుడు తహశీల్దార్‌కు తెలియజేస్తారని ఠాగూర్‌ తెలిపారు.
కంట్రోల్‌ రూం ఫోన్‌: 7997786667

RELATED ARTICLES
- Advertisment -

Most Popular