Homeతెలంగాణమహబూబాబాద్ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఖమ్మంలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆటోను ఢీకొన్న టిప్పర్

ఇద్దరు కూలీలు మృతి

నలుగురికి తీవ్ర గాయాలు

ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 2 :

ఖమ్మం రఘునాథపాలెం మండలం రేగులచలక సమీపంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళా కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు, మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular