ఘనంగా బడేటి మల్లేశం గౌడ్ నాల్గవ వర్ధంతి
రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో అన్నదానం
నివాళులర్పించిన వృద్దులు, సిబ్బంది
ఎల్బీనగర్, పెన్ పవర్, అక్టోబర్ 7:
హైదరాబాద్ వనస్థలిపురంలోని రెడీ టు సర్వ్ ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ తంగడపల్లికి చెందిన దివంగత బడేటి మల్లేశం గౌడ్ నాల్గవ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి వృద్దులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా వృద్ధాశ్రమ నిర్వాహకులు పెద్ది శంకర్ మాట్లాడుతూ బడేటి మల్లేశం గౌడ్ నాల్గవ వర్ధంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు తమ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. ఆ భగవంతుడి ఆశీస్సులు ఆ కుటుంబ సభ్యులపై ఉండాలని కోరుకున్నామని తెలిపారు. నివాళులు అర్పించిన వారిలో ఆశ్రమ సిబ్బంది, వృద్దులు ఉన్నారు.

