మండలంలో వేడెక్కిన రాజకీయం
గ్రామాల్లో రాజకీయ సందడి
కాజులూరు, పెన్ పవర్, అక్టోబర్ 21: కాజులూరు మండలంలో ఎంపీటీసీ స్థానాలకు బుధవారం నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. నామినేషన్ల స్వీకరణ తొలిరోజే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు మొత్తం 15 నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది.కాజులూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీకు సంబంధించి కాజులూరు మండల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్. విజయ్ రాజు వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించారు. తొలిరోజు దాఖలైన నామినేషన్లలో జనసేన పార్టీ నుంచి 3, తెలుగుదేశం పార్టీ నుంచి 4, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 8 ఉన్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీడియాకు వెల్లడించారు.మొత్తం 15 నామినేషన్లు దాఖలు కావడంతో కాజులూరు మండలంలో ఎన్నికల ప్రక్రియపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎన్నికల అధికారులు ప్రక్రియను ప్రశాంతంగా నిర్వహించారు.మండల వ్యాపంగా గ్రామాల్లో ఒక్క సారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.పలు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా నామినేషన్లు వేస్తూ .. గ్రామాల్లో సందడి చేస్తున్నారు. అధికార టీడీపీ పార్టీని వదిలి వైసీపీ కండువాలు వేసుకొని పార్టీ లో చేయడంపై ఆ గ్రామంలో సర్వాత్ర ఉత్కంఠ నెలకొంది.

