Homeఆంధ్రప్రదేశ్పెదవలసలో కూటమి అభ్యర్థి సప్పగడ్డ కుమారి విస్తృత ప్రచారం

పెదవలసలో కూటమి అభ్యర్థి సప్పగడ్డ కుమారి విస్తృత ప్రచారం

గూడెంకొత్తవీధి, పెన్ పవర్,నవంబర్ 3:మండలంలోని పెదవలస పంచాయతీ కూటమి ఎంపీటీసీ అభ్యర్థి సప్పగడ్డ కుమారి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. పంచాయతీ పరిధిలోని రాంపుల, కోకితపాడు, డోకూలూరు, చాపరాతిపాలెం తదితర గ్రామాల్లో పర్యటిస్తూ కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ర్యాలీ చేపట్టి ఓటర్లను కలుసుకున్నారు.ఈ సందర్భంగా సప్పగడ్డ కుమారి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు, ప్రజలకు అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రచారంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular