అశోక్‌నగర్ డ్రైనేజీ కష్టాలకు త్వరలో చెక్!
కొత్త పైప్‌లైన్ పనులకు రంగం సిద్ధం
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కౌకుట్ల రూపేందర్ రెడ్డి చొరవ
కాప్రా, పెన్ పవర్, నవంబరు 4:
హెచ్‌బీ కాలనీ 19వ డివిజన్ పరిధిలోని అశోక్‌నగర్ కాలనీలో దీర్ఘకాలంగా నెలకొన్న డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కౌకుట్ల రూపేందర్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారు. కాలనీలో మురుగునీటి లీకేజీలతో స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
బుధవారం ఉదయం అశోక్‌నగర్ కాలనీ సభ్యులతో కలిసి బస్తీ దవాఖాన రోడ్డుతో పాటు పలు వీధుల్లో పర్యటించిన రూపేందర్ రెడ్డి, అక్కడి పరిస్థితులను పరిశీలించారు. డ్రైనేజీ సమస్యల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ మేరకు నూతన డ్రైనేజీ పైప్లైన్లు ఏర్పాటు చేయాలని కోరుతూ పది రోజుల క్రితం డీజీఎం వేణుగోపాల్‌కు వినతిపత్రం అందజేసినట్లు రూపేందర్ రెడ్డి తెలిపారు. ఈ నెలలోనే కొత్త డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
నసీబ్ చికెన్ షాప్ రోడ్డు నుంచి వాస్తవి మెడికల్ షాప్ వరకు, అశోక్‌నగర్ పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయం రోడ్డు నుంచి బస్తీ దవాఖాన రోడ్డు వరకు, అశోక్‌నగర్ కమ్యూనిటీ హాల్ రోడ్డు, వేణు అన్న ఇంటి రోడ్డు ప్రాంతాల్లో నూతన డ్రైనేజీ పైప్లైన్ల ఏర్పాటు పనులు చేపట్టనున్నట్లు వివరించారు.
కాలనీలో మౌలిక సదుపాయాల మెరుగుదలకు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని కౌకుట్ల రూపేందర్ రెడ్డి తెలిపారు. ఈ పర్యటనలో కాలనీ సభ్యులు కనకయ్య, రాజు, శైలూ, అశోక్, నర్సింగరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

