నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపిన చింతకాయల అనిత
తాజా ఎన్నికలలో ఓటమిపాలైనప్పటికీ ప్రజా సమస్యలపై పోరాడుతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థినిగా పోటీ చేసిన చింతకాయల అనిత అన్నారు. ఈ మేరకు మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. ఎన్నికలలో మాపై నమ్మకంతో మాతో ప్రయాణం చేసిన 40 మంది కౌన్సిలర్ అభ్యర్థులకు, మాకు ఓట్లు వేసిన సుమారు 12,000 మంది ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికలలో ఓడినప్పటికీ వీరందరికీ అండగా ఉంటామన్నారు. నూతనంగా ఎన్నికైన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల అభీష్టం మేరకు ఎన్నికలలో గెలిచిన నూతన పాలకవర్గం, నర్సీపట్నం మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అంతిమంగా ఎన్నికలలో పోటీ చేసిన వారందరి లక్ష్యం ఈ ప్రాంత అభివృద్ధేనని, అభివృద్ధికి తాము ఎప్పుడు సహకరిస్తామని అన్నారు. అదేవిధంగా ప్రజల సమస్యల పైన పోరాడుతామని భరోసా ఇచ్చారు.

