Homeతెలంగాణఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ వెంకటేశం

ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ వెంకటేశం

ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా కర్నాటి వజ్రమ్మ వెంకటేశం

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 6:

ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ సొసైటీ, న్యూఢిల్లీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా నియమితులైన కర్నాటి వజ్రమ్మ వెంకటేశంను నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా కర్నాటి వజ్రమ్మ వెంకటేశంను శాలువాతో ఘనంగా సత్కరించారు. చేనేత రంగ అభివృద్ధికి, చేనేత కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. చేనేత కార్మికుల సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావిస్తూ వారి సంక్షేమానికి మరింత సేవ చేయాలని అభిలషించారు.
ఈ కార్యక్రమంలో చిటిపోలు పద్మ లక్ష్మీనారాయణ,చిటిపోలు ఇందిరా సత్యనారాయణ, చిటిపోలు రమేష్, చిటిపోలు అనిత సురేష్, జెల్ల పద్మ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular