- ఇంటి ఆడబిడ్డగా ఆశీర్వదించండి.. దామనపల్లి ప్రజలకు వంతల కాసులమ్మ విజ్ఞప్తి
గూడెంకొత్తవీధి, పెన్ పవర్, నవంబర్ 17:గూడెంకొత్తవీధి మండలం దామనపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేస్తున్న వంతల కాసులమ్మ గ్రామ ప్రజలను ఉద్దేశించి విజ్ఞప్తి చేశారు. తనకు సర్పంచ్‌గా ఒక్క అవకాశం కల్పిస్తే పంచాయతీ అభివృద్ధికి కృషి చేసి చూపిస్తానని తెలిపారు. రాజకీయ నాయకురాలిగా కాకుండా మీ ఇంటి ఆడబిడ్డగా ఆదరించి, ఆశీర్వదించాలని కోరారు. దశాబ్ద కాలంగా ఒకే కుటుంబానికి అధికారం పరిమితం కాకుండా, ఈ ఎన్నికల్లో మార్పు గురించి ప్రజలు ఆలోచించాలని ఆమె అభిప్రాయపడ్డారు. కుటుంబ పాలనకు బదులుగా ప్రజల భాగస్వామ్యంతో సాగే ప్రజా పాలనకు ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గ్రామ సమస్యల పరిష్కారం, పంచాయతీ అభివృద్ధి లక్ష్యంగా తనకు అవకాశం ఇవ్వాలని దామనపల్లి ప్రజలను కోరారు.

